FM Nirmala Sitharaman announces coronavirus relief package (Photo Credits: ANI)

New Delhi, March 26:  కరోనావైరస్ వ్యాప్తి ప్రభావంతో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో దీని ద్వారా కలిగే నష్టాలను కొంత వరకు పూరించేందుకు మరియు ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం భారీ ఉద్దీపన ప్యాకేజీని (Economic Relief Package) ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) గురువారం మీడియా ద్వారా వివరాలను వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అత్యవసరాలు, నిత్యావసరాలు, ఆహారం మరియు ఇతర రోజూవారీ కార్యక్రమాల కోసం 'గరీబ్ కళ్యాణ్' పథకం కింద రూ. 1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ మరియు పట్టణాల్లో నివసించే పేదవారిని దృష్టిలో పెట్టుకొని రాబోయే 3 నెలల కోసం ఈ ప్యాకేజీని రూపొందించినట్లు పేర్కొన్నారు.

కరోనావైరస్ తో పోరాడుతున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఆశా వర్కలు తదితరులకు ఒక్కొక్కరిపై రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

గరీబ్ అన్న యోజన పథకం కింద ప్రతి పేదవారికి ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలు రాబోయే మూడు నెలల పాటు ప్రతీనెల ఉచితంగా అందుతాయని అలాగే ప్రతి ఇంటికి ఒక కిలో పప్పు అదనంగా మూడు నెలల పాటు ఉచితంగా లభించనుందని పేర్కొన్నారు. ఉజ్వల్ పథక లబ్ది దారులకు మూడు నెలల పాటు ఎల్పీజీ సిలిండర్ ఉచితంగా లభిస్తుందని చెప్పారు.

పేద వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతినెల రూ. 1000 చొప్పున పెన్షన్ చెల్లింపు. ఉపాధి హామీ కూలీల దినసరి వేతనం రూ. 202కు పెంపు.

కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి తక్షణ సాయంగా నెలకు రూ. 2వేల చొప్పున జమ. ఏప్రిల్ మొదటి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు చేరతాయి.

Watch FM Announcements Here: 

జనధన్ ఖాతాలు కలిగిన మహిళలకు రాబోయే 3 నెలల పాటు వారి ఖాతాల్లో ప్రతీ నెల రూ. 500 జమ. డ్వాక్రా సంఘాలకు రూ. 20 లక్షల వరకు రుణం మంజూరు.

భవన నిర్మాణ, నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం 3.5 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరేలా రూ. 31,000 కోట్ల నిధులు ఉపయోగించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ.  ఐటీ రిటర్నుల గడువు పెంపు, జీఎస్టీ చెల్లింపుల గడువు పెంపు, లాక్‌డౌన్ నేపథ్యంలో కీలక ప్రకటనలు

100కు పైగా ఉద్యోగులున్న కంపెనీలలో రూ, 15 వేల లోపు నెల జీతం ఉన్న ఉద్యోగులకు రాబోయే మూడు నెలల వరకు పీఎఫ్ చెల్లింపులు మాఫీ, వారి తరఫున ఎంప్లాయర్ మరియు ఎంప్లాయి వాటా (12%+ 12%) ప్రభుత్వమే జమ చేస్తుంది.

ఈపీఎఫ్ ఖాతాదారులు 3 నెలల వరకు వారి పిఎఫ్ ఫండ్‌లో 75% ఉపసంహరించుకోవచ్చు,