Oxygen 'Express’ Trains: దేశంలో ముంచుకొస్తున్న ఆక్సిజన్‌ కరవు, నేటి నుంచి పట్టాలెక్కనున్న ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ సిలిండర్లను రవాణా చేయనున్న రైల్వే శాఖ, పరిశ్రమలకు ఆెక్సిజన్ సరఫరా నిలిపివేయాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం
'Oxygen Express Train' being used through green corridors to trasnport Liquid Medical Oxygen (LMO) and 0xygen cylinder, required for treatment of COVID-19 patients. | Photo Credit: PTI

New Delhi, April 19: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేప‌థ్యంలో రైల్వే శాఖ కీ‌ల‌క నిర్ణ‌యం తీసుకుం‌ది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సిలిండర్లను ఆస్పత్రిలకు త్వరితగతిన చేరవేసేందుకు ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో రైళ్లను (Oxygen 'Express’ Trains) నడపనున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ సిలిండర్లను రైళ్ల ద్వారా రవాణా చేయనుంది.

ముంబైలోని కలంబోలీ, ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని బొయీసర్‌ రైల్వే స్టేషన్ల నుంచి రోడ్‌ ట్యాంకర్లను ఫ్లాట్‌ వ్యాగన్లపై ఎక్కించి విశాఖ, జంషెడ్‌పూర్‌, రూర్కెలా, బొకారొకు సోమవారం తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. అక్కడ ట్యాంకర్లలో మెడికల్‌ ఆక్సిజన్‌ను లోడ్‌ చేశాక తిరిగి ప్రయాణమవుతాయి. రైళ్లలో మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్ల రవాణాకు (Oxygen Express) గల అవకాశాన్ని పరిశీలించాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు ఇటీవల కేంద్రాన్ని కోరాయి.

కాగా కొవిడ్‌ (Coronavirus Scare) ఉధృతి రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ (Oxygen) వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాణవాయువును సరఫరా చేసేందుకు నేటి నుంచి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ముంబైకి సమీపంలోని కలంబోలి, బోయ్సర్‌ రైల్వే స్టేషన్ల నుంచి సోమవారం ఉదయం ఖాళీ ఆక్సిజన్‌ ట్యాంకర్లతో కూడిన రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు బయలుదేరుతాయి. ఇవి మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత అధికంగా ఉండే విశాఖపట్నం, జంషేడ్‌పూర్‌, రౌకేలా, బోకరో ప్రాంతాల నుంచి ప్రాణవాయువును తీసుకువస్తాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పూర్తిగా ‘గ్రీన్‌చానల్‌’ మార్గంలో పయనిస్తాయి.

భారీగా తగ్గిన రెమ్‌డెసివిర్‌ ధరలు, కొత్త ధరల వివరాలను వెల్లడించిన ఎన్‌పీపీఏ, రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 28 లక్షల నుంచి 41 లక్షలకు పెంచాలని ఫార్మాకంపెనీలను కోరిన కేంద్రం

అంటే.. ఈ రైళ్లు వస్తున్నప్పుడు ఆ పట్టాల మీదుగా వచ్చే షెడ్యూల్‌ రైళ్లను కూడా నిలిపివేస్తారు. ఆయా మార్గాల్లో ఉండే రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిల ఎత్తును దృష్టిలో పెట్టుకుని, 1.29 మీటర్ల ఎత్తుండే వ్యాగన్లపైన.. 3.32 మీటర్లలోపు ఎత్తు ఉన్న ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ట్రక్కులను తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు భారతీయ రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ సేవలను అందిస్తున్నారు.

కాగా మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల అభ్య‌ర్థ‌న‌పై స్పందించిన రైల్వేశాఖ ఆగ‌మేఘాల‌పై కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం గ్రీన్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆక్సిజ‌న్ ట్యాంకర్లను ఎక్కించి, దించేందుకు ఎక్కడిక్కడ ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలని వివిధ జోన్ల రైల్వే అధికారుల‌కు సూచనలు అందాయి. ఇప్పటికే పలు చోట్ల ర్యాంప్‌ల నిర్మాణం కూడా చేపట్టారు. రైలు ఆయా ప్రాంతాలకు చేరుకునే సమయానికి ఆయా రైల్వే స్టేష‌న్ల ప‌రిధిలో ర్యాంప్‌ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. రైలు మార్గం ద్వారా వచ్చిన ట్యాంకర్లు రోడ్లపై వెళ్లేటప్పుడు అవాంతరాలు ఎదుర‌వ్వ‌కుండా ఎత్తు, వెడల్పు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, నలుగురు సజీవ దహనం, దేశంలో కొత్తగా 2 ,61,500 మందికి కరోనా నిర్ధారణ, తాజాగా 39 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కోవిడ్

ఇక ఆక్సిజన్ కి డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో.. డిమాండ్‌కు తగ్గట్లు ఆక్సిజన్‌ను అందించేందుకు కేంద్రం చర్యలను ప్రారంభించింది. పరిశ్రమలకు వినియోగించే ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు మళ్లించాలని సూచించింది. 9 రకాల పరిశ్రమలకు మినహా.. మిగతా వాటికి ప్రాణవాయువు సరఫరాను నిలిపివేయాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఈ నెల 22 నుంచి దీన్ని అమలు చేయాలని సూచించారు.

సాధికార బృందం(ఈజీ)-2 భేటీలో చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా.. ఆక్సిజన్‌ సరఫరా నిషేధం నుంచి మినహాయింపునిచ్చిన వాటిలో.. ఇంజక్షన్ల సీసాలు/వయల్స్‌ తయారీ, ఫార్మా, పెట్రోలియం రిఫైనరీలు, ఉక్కు, న్యూక్లియర్‌ ఎనర్జీ, ఆక్సిజన్‌ సిలిండర్ల తయారీ, వృథా నీటి పునర్వినియోగం, ఆహారం-నీటి శుద్ధి, ప్రాసెసింగ్‌ పరిశ్రమలున్నాయి.