Remdesivir Price Reduced: భారీగా తగ్గిన రెమ్‌డెసివిర్‌ ధరలు, కొత్త ధరల వివరాలను వెల్లడించిన ఎన్‌పీపీఏ, రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 28 లక్షల నుంచి 41 లక్షలకు పెంచాలని ఫార్మాకంపెనీలను కోరిన కేంద్రం
Remdesivir (Photo Credits: ANI)

New Delhi, April 18: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నా అది పనిచేయడానికి కొంత కాల వ్యవధి ఉండటంతో చాలామంది కరోనా బారీన పడుతున్నారు. కరోనా పేషెంట్లకు వాడే మందులు కూడా భారీ ధరగా పెరగడంతో కేంద్రం అలర్ట్ అయింది. కోవిడ్‌–19 చికిత్సలో సీరియస్‌ పెషెంట్లకు వాడే రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ధరలను తగ్గించాలని (Remdesivir Price Reduced) ఫార్మా కంపెనీలను కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యంతో రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ధరలను ఫార్మా కంపెనీలు స్వచ్ఛందంగా తగ్గించాయని (Remdesivir manufacturers cut price) నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) శనివారం తెలిపింది.

దేశంలో కేసులు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అత్యవసర ఔషధమైన రెమిడెసివిర్‌కు తీవ్ర కొరత ఏర్పడిందనే వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 28 లక్షల నుంచి 41 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. అలాగే ఈ ఔషధం ధరలను తగ్గించాలని ఫార్మా కంపెనీలను కోరింది. ‘ప్రభుత్వ జోక్యం రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ (100 ఎంజీ వయల్‌) ధరలు దిగివచ్చాయి. కరోనాపై పోరులో ప్రభుత్వంతో చేతులు కలిపినందుకు ఫార్మా కంపెనీలకు ధన్యవాదాలు’అని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు.

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, నలుగురు సజీవ దహనం, దేశంలో కొత్తగా 2 ,61,500 మందికి కరోనా నిర్ధారణ, తాజాగా 39 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కోవిడ్

ఫార్మా సంస్థల నిర్ణయాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ స్వాగతించారు. కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు ఉపశమయం లభించే విషయం ఇది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఫార్మా సంస్థలు రెమ్‌డెసివిర్‌ ధరలను తగ్గించాయి. కరోనాపై పోరులో ప్రధాని మోదీతో కలిసి నిలబడ్డ ఫార్మా సంస్థలకు నా కృతజ్ఞతలు’ అని ట్వీట్‌ చేశారు.

మునుపటి ధర.. అలాగే సవరించిన ధరలు ఇలా ఉన్నాయి

క్యాడిలా హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ రెమ్‌డాక్‌ 2,800 899

సింజెన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రెమ్‌విన్‌ 3,950 2,450

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ రెడిక్స్‌ 5,400 2,700

సిప్లా లిమిటెడ్‌ సిప్రెమి 4,000 3,000

మైలాన్‌ ఫార్మాస్యూటికల్స్‌ డెస్‌రెమ్‌ 4,800 3,400

జుబిలెంట్‌ జెనెరిక్స్‌ లిమిటెడ్‌ జుబి-ఆర్‌ 4,700 3,400

హెటిరో హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ కొవిఫర్‌ 5,400 3,490