Newdelhi, April 12: బులియన్ మార్కెట్, అమెరికాలో (America) ఆర్థిక సంక్షోభం భయాలు వెరసి ఇటీవల కాలంలో బంగారం (Gold), వెండి (Silver) ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. బుధవారం (ఏప్రిల్ 12) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,700 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,760 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 24 క్యారెట్లపై రూ.330 మేర పెరిగింది. కాగా, కిలో వెండి ధర రూ.300 మేర పెరిగి రూ.76,600 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,760 గా ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 లుగా కొనసాగుతోంది.
వెండి ధరలు..
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,400
- విజయవాడలో రూ.80,400
- విశాఖపట్నంలో రూ.80,400 లుగా ఉంది.