Newdelhi, April 12: భారత ప్రభుత్వ సంస్థ భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) (BHEL) వందేభారత్ రైళ్ల (Vande Bharat Express) సరఫరా ఆర్డర్‌ను (Order) చేజిక్కించుకుంది. ఒక్కో రైలుకు రూ. 120 కోట్ల చొప్పున మొత్తం రూ.9600 కోట్ల ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. ఈ కన్షార్షియంలో భాగస్వామిగా ఉన్న టిటాగఢ్ వ్యాగన్స్‌తో కలిసి భెల్ ఈ రైళ్లను తయారు చేయనుంది. 35 ఏళ్ల కాలానికి వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ (ఏఎంసీ) కూడా ఇందులో ఉన్నట్టు భెల్ తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లలో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు మాత్రమే ఉన్నాయి. దీంతో స్లీపర్ క్లాస్ రైళ్లు నడపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్డర్లు పిలవగా భెల్ దానిని దక్కించుకుంది.
BHEL-Titagarh Wagons consortium receives order to supply 80 Vande Bharat trains at rs 120 crore per train@BhavyataKagrana https://t.co/XHdZdaiqZZ
— CNBC-TV18 (@CNBCTV18Live) April 11, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)