Coronavirus | Representational Image (Photo Credits: ANI)

New Delhi January 02: భారత్‌లో కరోనా (Corona)తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,553 కరోనా కేసులు(Corona Cases) నమోదయ్యాయి. ఈ మహమ్మారి ధాటికి నిన్న ఒక్కరోజే 284 మంది మృతి(Corona Deaths) చెందారు. గడిచిన ఆరు నెలల్లో ఎన్నడూ లేనట్లుగా యాక్టీవ్ కేసుల సంఖ్య(Corona Active cases) గణనీయంగా పెరిగింది. ఈ స్థాయిలో రోజువారీ కేసులు నమోదవ్వడం కూడా ఆరు నెలల తర్వాత ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో 1,22,801 యాక్టీవ్ కేసులున్నాయి.

ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్యతో పోలిస్తే రోజువారీ కేసులు రెట్టింపయ్యాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 9,249 మంది మాత్రమే కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు క్రమంగా తగ్గుతోంది. అటు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల(Omicron cases in India) సంఖ్య 1,525కు చేరింది.