New Delhi, Jan 9: కోవోవాక్స్ టీకాకు బూస్టర్ డోసుగా మరో 15 రోజుల్లో ఆమోదం లభించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా తెలిపారు. కోవోవాక్స్ టీకా కరోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్‌పై కూడా ప్రభావంతంగా పనిచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. భారతి విద్యాపీఠ్ యూనివర్సిటీ ఈవెంట్‌లో పాల్గొన్నపూనావాలా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వద్ద కోవీషీల్డ్ టీకాల స్టాక్ ఉందని స్పష్టం చేశారు.
అయితే కోవీషీల్డ్ కన్నా.. కోవోవాక్స్ బెస్ట్ బూస్టర్‌గా పనిచేస్తుందని పూనావాలా తెలిపారు. ప్రపంచదేశాలన్నీ ఇండియా వైపే చూస్తున్నాయని, హెల్త్‌కేర్ అంశంలో భారీ జనాభా ఉన్న మన దేశం ఎలా జాగ్రత్తలు తీసుకున్నదో గమనిస్తున్నారని, కోవిడ్ వేళ ఇండియా 80 దేశాలకు సాయం కూడా చేసిందని ఆయన తెలిపారు.