
Bejing, JAN 05: చైనా రాజధాని బీజింగ్‌లో (Bejing) దాదాపు హాస్పిటళ్లు అన్నీ ఫుల్ అయ్యాయి. కోవిడ్ లక్షణాలతో హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. అయితే పాపులర్ వ్యక్తుల మరణాలు (Celebrity deaths) ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ఇప్పుడు అక్కడ కొంత ఆందోళనకర పరిస్థితిని క్రియేట్ చేస్తోంది. 40 ఏళ్ల మేటి ఒపెరా సింగర్ చూ లాన్‌లన్ (Chu Lanlan died) మరణించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో చాలా మంది భయాందోళనలకు గురవుతున్నారు. అసలు అధికారికంగా కోవిడ్ మృతుల లెక్క ఎంత ఉంటుందో అని భయపడుతున్నారు. గత డిసెంబర్‌లో కోవిడ్ జీరో పాలసీని చైనా ఎత్తివేసింది. దాంతో అక్కడ ఒక్కసారిగా మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసులు (Corona Cases) పెరిగాయి. హాస్పిటళ్లు, శ్మశానవాటికలు మళ్లీ కిక్కిరిసిపోతున్నాయి. రోజువారీ కేసుల వివరాలను వెల్లడించేందుకు చైనా నిరాకరిస్తోంది.
డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కేవలం 22 మంది మాత్రమే చనిపోయినట్లు ఆ దేశం పేర్కొన్నది. కేవలం శ్వాసకోస ఇబ్బందులు, న్యుమోనియా లాంటి కేసుల్ని మాత్రం లెక్కిస్తున్నారు. చూ లాన్‌లన్ లాంటి (Chu Lanlan died) పబ్లిక్ ఫిగర్లు మృతి కలవరం రేపింది. ఇక మృతుల లెక్కలపై ప్రభుత్వం ఇస్తున్న అధికారిక లెక్కలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
న్యూ ఇయర్ రోజున నటుడు గాంగ్ జిన్‌టాంగ్ మరణం కూడా చైనా ఇంటర్నెట్ యూజర్లను తెగ ఆందోళనకు గురి చేసింది. ఫాదర్ కాంగ్ పాత్రతో గాంగ్ టీవీ ప్రేక్షకుల్ని ఆకర్షించారు. మాజీ జర్నలిస్టు, నాన్‌జింగ్ వర్సిటీ ప్రొఫెసర్ హూ ఫూమింగ్ జనవరి రెండో తేదీన మరణించారు. డిసెంబర్ 21 నుంచి 26వ తేదీ వరకు దేశంలోని టాప్ సైన్స్, ఇంజనీరింగ్ సైంటిస్టులు 16 మంది చనిపోయినట్లు చైనా మీడియా తెలిపింది. నిజానికి వీళ్ల మరణాలకు కోవిడ్ కారణమని ఎక్కడా చెప్పకపోయినా.. ఇంటర్నెట్ యూజర్లు మాత్రం ఆ డౌట్స్‌ను వ్యక్తం చేస్తున్నారు.