Lucknow, OCT 23: దొంగ అనే ఆరోపణతో ఒక దళిత యువకుడిని (Dalit man) కట్టేసి విపరీతంగా కొట్టి, అతడి ముఖానికి నలుపు రంగు పూసి, గుండు గీసి ఊరంతా తింపారు. ఇంత చిత్రవధకు గురైన ఆ దళిత యువకుడి మీద వచ్చిన దొంగతనం ఆరోపణ ఏంటంటే.. బాత్రూంలో ఉండే సీటు చోరీ చేయడం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ (Bahraich) జిల్లా హర్దిలో మంగళవారం జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ జనతా పార్టీకి (BJP) చెందిన స్థానిక నాయకులు రాధేశ్యామ్ మిశ్రా, అతడి ఇద్దరు సహాయకులు రాజేశ్ కుమార్(30) అనే వ్యక్తిని రోడ్డుపై ఉన్న ఒక పోలుకు కట్టేసి చితకబాదుతున్నారు. బాధితుడి ముఖం, తల మొత్తం నలుపు రంగులో (INK) నిండిపోయి ఏమాత్రం గుర్తు పట్టనంతగా మారిపోయింది.
बहराइच में राधेश्याम मिश्रा एवं अन्य ने एक SC युवक पर चोरी का आरोप लगाकर उसे खंबे से बांधा, चेहरे पर कालिख पोती और उसका सिर मुड़वाया।
SC लोगों द्वारा धम्म दीक्षा लेने पर छटपटाने वाले तमाम ब्राह्मण-हिंदू अब मौन क्यों धारण किए हुए हैं?pic.twitter.com/lXwZIGwgT5
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) October 21, 2022
అప్పటికే బాగా కొట్టారు కాబోలు.. నొప్పిని కూడా గ్రహించలేని స్థితిలోకి వెళ్లాడు. తమ ఇంట్లోని బాత్రూంలో సీటు ఎత్తుకెళ్లిన కారణంతో రాజేశ్‌ను ఇంతలా హింసించినట్లు వారు పేర్కొన్నారు.. కొద్ది సేపటికి రాజేశ్కిగుండు కొట్టించి వీధుల్లో తిప్పారు. రాజేశ్ (Rajesh) రోజూ కూలీ పని చేసే వ్యక్తి. అతడిని కొడుతుంటే చుట్టూ గుమిగూడిన జనం చప్పట్లు కొడుతూ నినాదాలు చేశారు.
రాజేశ్ కులాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రాధేశ్యామ్ మిశ్రా పరారీలో ఉన్నాడని, అతడి ఇద్దరు సహాయకుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.