దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది.. గత మూడు రోజుల నుంచి గాలి కాలుష్య తీవ్రత వరుసగా పెరుగుతూ వస్తున్నది. సోమవారం 322 గా ఉన్న ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) మంగళవారం 327కు చేరింది. బుధవారం ఉదయానికి 336కు పెరిగింది. సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (SAFAR)- ఇండియా ఈ వివరాలను వెల్లడించింది. కాగా పంజాబ్‌ రాష్ట్రంలోని రైతులు తమ పంట పొలాల్లో కొయ్య కాలు కాల్చివేత (స్టబుల్‌ బర్నింగ్‌) కారణంగా వెలువడే దట్టమైన పొగలు ఢిల్లీ వాయు కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలం గాలిలో తేమకు ఈ పొగ తోడు కావడంతో కాలుష్యం పెరుగుతోంది. దాంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యాలకు ముప్పు పొంచి ఉంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)