New Delhi, June 26: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో (CBI) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ (Kejriwal Arrest) అయ్యారు. ఆయన్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తీహార్ జైలులో (Tihar Jail) కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడి. ఇవాళ ట్రయల్ కోర్టు ముందు కేజ్రీవాల్ ను (Kejriwal) సీబీఐ హాజరుపరచనుంది. కేజ్రీవాల్ ను కోర్టు ముందు హాజరుపరిచేందుకు ఇప్పటికే అనుమతి తీసుకున్న సీబీఐ అధికారులు.. విచారణ నిమిత్తం ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని ట్రయల్ కోర్టులో కోరనున్నారు. ప్రస్తుతం ఈడీ కేసులో భాగంగా తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో కేజ్రీవాల్ ఉన్నారు. మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారం రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఈడీ.. అనంతరం వారం రోజుల తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఎన్నికల సందర్భంగా మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ పై విడుదలై, బెయిల్ ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి జూన్ 2న మధ్యాహ్నం తీహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయారు.
Central Bureau of Investigation examined Delhi CM Arvind Kejriwal in Tihar Jail and recorded his statement related to the Excise Policy case today. CBI also got permission for Arvind Kejriwal's production before the concerned trial court tomorrow. He will be produced before the…
— ANI (@ANI) June 25, 2024
ట్రయల్ కోర్టు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు గత గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై గత శుక్రవారం హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో విచారణకు ముందే సీబీఐ కోర్టులో కేజ్రీవాల్ ను అధికారులు హాజరుపర్చనున్నారు. దీంతో ఈ కేసులో ఆయన్ను అధికారికంగా అరెస్టు చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాల సమాచారం.