COVID-19 In Delhi (Photo Credits: PTI)

New Delhi January 08:  ఢిల్లీలో కరోనా తీవ్రత(Corona virus in Corona) కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. నిన్న 15వేలకు పైగా రోజువారీ కేసులు రాగా, ఇవాళ డైలీ కేసులు 20వేలు దాటే అవకాశముందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్(Satyendra Jain) తెలిపారు.  పాజిటివిటీ రేటు(Positivity rate) 1-2 శాతం పెరిగిందన్నారు. ఇప్పటికే ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు (Positivity rate) 13 శాతం ఉంది. ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 10శాతం బెడ్లు నిండిపోయాయని తెలిపారు సత్యేంద్ర జైన్.

ఒమిక్రాన్ కేసులు(Omicron cases) కూడా దేశ రాజధానిలో తీవ్రంగానే ఉన్నాయి. దీంతో వీకెండ్స్ లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ (Weekend Lock down) అమలు చేస్తున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్పితే ప్రజలు ఇళ్లకు బయటకు రాకుండా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పాజిటివిటీ రేటు, ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను బట్టి తీవ్రతను అంచనా వేయనున్నారు. ఒకవేళ బెడ్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆంక్షలను మరింత కఠినతరం చేసే అవకాశముంది.