Cyclone (Photo credits: IMD)

చెన్నై, మార్చి 5: తమిళనాడు తీరం వైపునకు ఈ ఏడాదిలో తొలి తుపాను ముంచుకొస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి, ఆపై తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. గడిచిన 7 గంటల నుంచి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఇది తీరంవైపుగా దూసుకొస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని నాగపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

మరికొద్ది గంటల్లో తీవ్రవాయుగుండం పూర్తిగా దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా రానుంది. వాయుగుండం కారణంగా తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

యుక్రెయిన్‌ లో మరో పెను ప్రమాదం, రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా ముప్పువాటిల్లే అవకాశం

అలాగే తమిళనాడు, రాయలసీమ, దక్షిణకోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో.. తమిళనాడులో భారీ వర్షాలు కురవచ్చని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.