Mumbai, AUG 30: దేశంలోని మూడు ఎయిర్ లైన్స్ (Airlines) మీద పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలకు ఉపక్రమించింది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఆకాశ(Air Akasha), స్పెస్ జెట్ సంస్థల్లో వేర్వేరు లోపాల కారణంగా డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నది. ఎయిర్ ఇండియాపై (Air India Fined) రూ.10 లక్షల జరిమాన విధించింది. ఆకాశ ఎయిర్ సంస్థ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆకాశ ఎయిర్ ‘ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఆల్ కెమిస్ట్ ఏవియేషన్’ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేసింది. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ విమాన సర్వీసులు తగ్గించిన స్పైస్ జెట్ పై నిఘా పెంచింది. స్పాట్ చెక్స్, నైట్ నిఘా పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహించిన స్పెషల్ అడిట్ లో కొన్ని లోపాలు ఉన్నట్లు డీజీసీఐ నిర్ణయించింది. ఇక విమాన సర్వీసులు రద్దు (Air Service) చేసిన ప్రయాణికులకు పరిహారం చెల్లించనందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థపై రూ.10 లక్షల జరిమాన విధించింది.
. సిబ్బందికి ప్రాక్టికల్ ట్రైనింగ్ సెషన్లు నిర్వహించినా, ఆకాశ ఎయిర్ వాటికి రెగ్యులేటరీ అప్రూవల్స్ పొందడంలో లేదని డీజీసీఏ గుర్తించింది. ఆకాశ ఎయిర్ ట్రైనింగ్ సంస్థ ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ లోపాన్ని సరి చేయకపోవడంతో ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ట్రైనీ పైలట్, ఆన్ బోర్డ్ ఇన్ స్ట్రక్టర్ మరణించారు.