Agra November 21: మనుషులకు వైద్యం చేసే ఆస్పత్రులు చూశాంజంతువులకు వైద్యం చేసే దవాఖానాలు చూశాం కానీ దేవుడి విగ్రహానికి వైద్యం కోసం వచ్చిన వ్యక్తిని చూశారా? ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయ పూజారి బాలకృష్ణుడి విగ్రహం చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. తన కన్నయ్యకు చెయ్యి విరిగిందని, దానికి కట్టు కట్టాలని డాక్టర్లను కోరాడు. దాంత షాక్ తినడం వారి వంతయింది.

ఆగ్రాలోని బాలకృష్ణుడి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు లేఖ్ సింగ్. శుక్రవారం రోజు లడ్డూ గోపాల్‌ అని పిలిచే బాలకృష్ణుడి విగ్రహానికి ఉదయం స్నానం చేయించే సమయంలో అతని చెయ్యిజారింది. దీంతో విగ్రహం చెయ్యి విరిగింది. వెంటనే ఆ విగ్రహాన్ని తీసుకొని ఆసుపత్రికి వచ్చిన లేఖ్ సింగ్‌.. తన కృష్ణుడికి వైద్యం చేయాలని, చేతికి కట్టు కట్టాలని అడిగాడు. దీంతో అతను తమపై ప్రాంక్‌ చేస్తున్నాడని భావించారు వైద్యులు. అతని మాటలను పట్టించుకోలేదు. తన మాటలు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏడవడం ప్రారంభించాడు. దీంతో అతని బాధ చూడలేని వైద్యులు శ్రీ కృష్ణ అనే పేషెంట్‌కు వైద్యం చేస్తున్నట్లు రిజిస్టర్ చేసుకొని, ఆ విగ్రహానికి కట్టు కట్టి పంపారు.