Modi Government Action On Pharma Firms (Photo Credits: Maxi Pixel)

New Delhi, AUG 12: డాక్టర్లు తమ వద్దకు వచ్చే రోగులకు తక్కువ ధరకు లభించే జనరిక్‌ ఔషధాల (generic drugs)నే రాయాలని కేంద్రం ఆదేశించింది. లేదంటే డాక్టర్ల (Doctors)పై చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే వారి లైసెన్సును కూడా సస్పెండ్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ (NMCRMP) పేరుతో జారీ చేసిన కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. 2002లో భారత వైద్య మండలి (IMC) జారీ చేసిన నిబంధనల ప్రకారం దేశంలోని ప్రతి వైద్యుడు జనరిక్‌ మందుల (Generic Medicines)నే ప్రిస్క్రైబ్‌ చేయాలనే సూచనలు ఉన్నప్పటికీ.. దీనికి భిన్నంగా వ్యవహరించే వైద్యులపై ఎలాంటి చర్యలను అందులో పేర్కొనలేదు. తాజాగా ఆ నిబంధనల స్థానంలో ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ నియమావళి-2023 అమల్లోకి తెచ్చినట్లు జాతీయ వైద్య కమిషన్‌ (NMC) వెల్లడించింది. ఇందులో నిబంధనలను పాటించని వైద్యులపై చర్యలను కూడా పేర్కొన్నారు.

Onion Buffer Stock: సామాన్యులకు శుభవార్త.. ఉల్లి ధర నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్రం.. గోదాముల్లో బఫర్ స్టాక్‌ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటన 

దీని ప్రకారం.. ‘‘ప్రతి రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్‌ తమ వద్దకు వచ్చే రోగులకు జనరిక్‌ పేర్లతో ఔషధాలను రాయాలి. అనవసర మందులు, అహేతుకమైన ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ ట్యాబ్లెట్లను సూచించకూడదు’’ అని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే.. సదరు వైద్యులను హెచ్చరించడంతో పాటు వర్క్‌షాపులకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తారు. ఒకవేళ పదే పదే నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే.. ఆ డాక్టర్‌ లైసెన్సును కొంతకాలం పాటు నిలిపివేయనున్నట్లు నిబంధనల్లో వెల్లడించారు.

HC On Fake Cases By Woman For Money: డబ్బుల కోసమే అత్యాచారం చేశారంటూ మగవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు, మహిళల ఫేక్ కేసులపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 

ఇక, వైద్యులు రాసే మందుల చీటీలో ఔషధాల పేర్లను క్యాపిటల్‌ అక్షరాల్లో రాయాలని జాతీయ వైద్య కమిషన్‌ ఆ నిబంధనల్లో పేర్కొంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తీ తన సంపాదనలో అధికభాగం హెల్త్‌కేర్‌ కోసమే వెచ్చించాల్సి వస్తుంది. అయితే, బ్రాండెడ్‌ ఔషధాలతో పోలిస్తే జనరిక్‌ మందుల ధరలు 30 నుంచి 80శాతం తక్కువగానే ఉన్నాయి. వైద్యులు జనరిక్ మందులనే ప్రిస్క్రైబ్‌ చేయడం వల్ల వైద్య ఖర్చులు తగ్గడంతో పాటు అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించినట్లవుతుంది’’ అని ఎన్‌ఎంసీ తమ నిబంధనల్లో పేర్కొంది.