Newdelhi, Aug 12: నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలవుతున్న సామాన్యులకు కేంద్రం (Centre) శుభవార్త (Good news) చెప్పింది. దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను (Onion Price) కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో గోదాముల్లో బఫర్ స్టాక్‌ గా (Buffer Stock) నిల్వచేసిన ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లోగల ముఖ్యమైన మార్కెట్లకు ఉల్లిపాయలను సరఫరా చేసేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ ఏడాది అత్యధిక ధరలు నమోదైన ప్రాంతాలతో పాటూ దేశంలో సగటు ఉల్లి ధర కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, గత నెలలో పోలిస్తే అధిక ధర చూసిన ప్రాంతాలకు వీటిని సరఫరా చేయబోతున్నట్టు పేర్కొంది. ఈ-వేలం, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రిటైల్ విక్రయ మార్గాల ద్వారా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు చెప్పింది.

Karimnagar Shocker: కరీంనగర్ లో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తున్న ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు.. మృతి.. కారణం ఇదేనా?

Viral Video: కర్మ ఫలితం ఇలానే ఉంటుంది, కారును తప్పించుకుని డివైడర్‌ని ఢీకొట్టిన బైకర్, క్యాప్షన్ ఇవ్వండంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)