తండేల్ సినిమా(Tandel Movie) టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.75 పెంచుకునేందుకు(Tandel Movie Ticket Price Hike) అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదల రోజు నుండి 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది.

మరోవైపు  ప్రముఖ సినీ నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్‌ ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.  ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ

AP Govt Approves Ticket Price Hike for "Thandel" Movie

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)