Khushinagar, OCT 13: సాధారణంగా పాము కాటు (Snake bite) వేస్తే మనిషి చనిపోతాడు. మనిషిని కాటు వేసిన పామే మరణించింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో (Uttarapradesh) చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పం కింగ్ కోబ్రా. ఇది కాటు వేస్తే క్షణాల్లో మనిషి ప్రాణాలు కోల్పోతాడు. అలాంటి విష సర్పం ఓ మనిషిని కాటు వేసి మృతి చెందింది. ఇదేంటి కింగ్ కోబ్రా (King cobra) మనిషిని కాటు వేసి మరణించడమేంటని అనుకుంటున్నారా? ఇది నిజం. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఖుషినగర్ జిల్లా (Khushinagar) ఆస్పత్రి అత్యవసర విభాగానికి వెళ్లాడు. వైద్యుల వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. కింగ్ కోబ్రా (King cobra) తనని రెండు సార్లు కాటు వేసిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే అది మృతి చెందిందని వివరించారు.
View this post on Instagram
వైద్యులను నమ్మించేందుకు చనిపోయిన కింగ్ కోబ్రాను కవర్‌లో వేసి తన వెంట తీసుకొచ్చి వైద్యులకు చూపించాడు. ఈ ఘటనతో వైద్యులు ఆశ్చర్యపోయారు. సదరు వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. అయితే మనిషిని కాటేసిన పాము చనిపోయిన ఘటనకు సంబంధించిన వార్త వైరల్ గా మారడంతో అతని గురించి ఖుషీనగర్‌లో ఆరా తీస్తున్నారు.