Earthquake Representative Image (Photo Credit: PTI)

New Delhi, AUG 11: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 2.56 గంటలకు పోర్టుబ్లేయిర్‌ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. పోర్టుబ్లేయిర్‌కు (Port Blair) 112 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు పేర్కొంది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

 

కాగా, ఈ నెల 2వ తేదీ నుంచి అండమాన్‌ దీవుల్లో (Andaman islands) భూమి కంపించడం ఇది మూడోసారి. గత గురువారం (ఆగస్టు 3) తెల్లవారుజామున 4.17 గంటలకు 43. తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్‌సీఎస్‌ తెలిపింది. అదేవిధంగా ఈ నెల 2న తెల్లవారుజామున 5.40 గంటలకు 5.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక జూలై 29న కూడా 5.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.