Bangalore, April 26: దేశంలో రెండోదశ ఎన్నికలు దాదాపు పూర్తయ్యాయి. ఈ సమయంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ అభ్యర్థి, తేజస్వి సూర్యపై కేసు (Tejasvi Surya) నమోదైంది. సూర్య మత ప్రాతిపదికన ఓట్లు అడిగి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల సంఘంగా కేసు నమోదు చేసింది. ఈ విషయాన్ని కర్నాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
తేజస్వి సూర్యపై బెంగళూరులోని జయనగర్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 123 (3) కింద కేసు నమోదైంది. మతం పేరుతో ఓట్లు అడగటం సూర్య చేసిన నేరమని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా.. వారి మీద ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికే పలు జాతీయ పార్టీల కీలక నేతలపై కూడా ఈసీకి పిర్యాదులు అందాయి.