Three Terrorists Gunned Down by Security Forces in Encounter on Jammu-Srinagar National Highway (photo-PTI)

Pulwama, March 12: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది మరణించాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. పుల్వామాలోని నైనా బట్‌పోరాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులున్నారన్న సమాచారం అందింది. దీంతో వారు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు. ఉగ్రవాదులు ఒకచోట దాక్కుని ఉండగా భద్రతాదళాలు లొంగిపోవాలని హెచ్చరించాయి.

అయినా లెక్క చేయకుండా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతాదళలాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించారు. ఇద్దరిని భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఒక ఉగ్రవాది హత మయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం తో భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మృతి చెందిన ఉగ్రవాది జైషే మహ్మద్ సంస్థకు చెందిన వాడిగా గుర్తించారు.