EPFO (Credits: Facebook)

New Delhi, SEP 17: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPF)లో డబ్బులు దాచుకునే ఉద్యోగులకు చేదువార్త. రానున్న రోజుల్లో పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగుల భవిష్యనిధిపై ఇస్తున్న వడ్డీ రేట్లను (epf interest rate ) పునఃపరిశీలించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించిందని ఆర్టీఐ సమాచారం ఆధారంగా ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓ ​​మిగులును అంచనా వేసిన తర్వాత కూడా నష్టాన్ని చవిచూసింది. రూ. 449.34 కోట్ల మిగులు ఉంటుందని అనుకున్నప్పటికీ రూ. 197.72 కోట్ల లోటును ఎదుర్కొంది. దీంతో పీఎఫ్‌పై ఇస్తున్న వడ్డీ రేట్లను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Uttar Pradesh: వీడియో ఇదిగో, ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుండగా గుండెపోటు, ఒక్కసారిగా కుప్పకూలి మరణించిన యువకుడు 

ఈపీఎఫ్‌ఓ 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును (epf interest rate) 8.15 శాతంగా నిర్ణయించింది. అయితే నష్టాలను దృష్టిలో ఉంచుకుని, వడ్డీ రేటును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. పీఎఫ్‌పై అధిక వడ్డీ రేట్లను తగ్గించి మార్కెట్ రేట్లతో సమానంగా తీసుకురావాల్సిన అవసరం ఉందంది. ప్రస్తుతం పీఎఫ్‌పై వచ్చే వడ్డీని మార్కెట్‌తో పోల్చితే కాస్త ఎక్కువే. చాలా పొదుపు పథకాల్లో వడ్డీ పీఎఫ్‌పై చెల్లించే వడ్డీ కంటే తక్కువగానే ఉంది.ఈ కారణంగానే పీఎఫ్ వడ్డీని 8 శాతం దిగువకు తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చాలా కాలంగా వాదిస్తోంది.