Rajinikanth Politics Row: రజనీ రాజకీయాల్లోకి రావాలి, వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, చెన్నైలో రోడ్డు మీదకు వచ్చిన వేలాది మంది అభిమానులు, పార్టీ పెట్టాలని డిమాండ్
Rajinikanth (Photo Credits: PTI)

Chennai, Jan 10: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడంతో రాజకీయాల్లోకి రాలేనంటూ ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఆయన అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోవడం లేదు. తలైవార్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని (Rajinikanth Politics Row) పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా రజనీ రాయకీయాల్లోకి రావాలని, ఆయన సీఎం కావాలని పట్టుపడుతున్నారు.

చెన్నైలో ఫ్యాన్స్ క్లబ్‌కు చెందిన వేలాది మంది ప్రదర్శనకు దిగారు. రాజకీయంలోకి అడుగుపెట్టకూడదన్న తలైవా నిర్ణయాన్నిమార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టాలని (Fan club urges Rajinikanth to join politics) డిమాండ్ చేశారు. రజనీ రాజకీయాల్లోకి రావాలని నినాదాలు చేశారు.

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి రావాలంటూ చెన్నైలో ఆయ‌న అభిమానులు భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. చెన్నైలోని వ‌ళ్లువార్ కొట్ట‌మ్‌లో జ‌రిగిన ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో వంద‌లాది మంది ర‌జినీకాంత్ (Superstar Rajinikanth) అభిమానులు పాల్గొన్నారు. అనారోగ్యం కార‌ణంగా రాజ‌కీయాల్లోకి రాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నానంటూ ఇటీవ‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని వారు కోరారు.

Here's ANI Update

మ‌రికొన్ని నెల‌ల్లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగనున్న నేప‌థ్యంలో ర‌జినీకాంత్ గ‌త డిసెంబ‌ర్‌లో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లో రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే ఆ త‌ర్వాత కొద్ది రోజులకే ఆయ‌న స్వ‌ల్ప అనాగ్యానికి గురై కోలుకున్నారు. కానీ, అనారోగ్యం కార‌ణంగా రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేయాల‌న్న త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న అభిమానులు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టి ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి రావాల‌న్న త‌మ ఆకాంక్ష‌ను వెల్ల‌డించారు.

ఆ దేవుడు నన్ను హెచ్చరించాడు, రాజకీయాల్లోకి రావడం లేదని రజనీకాంత్ సంచలన ప్రకటన, అభిమానులంతా నన్ను క్షమించాలని కోరిన తలైవా

రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ సభ్యులకు వల్లూవర్ కొట్టం వద్ద ప్రదర్శన ఇవ్వడానికి చెన్నై పోలీసులు అనుమతి ఇచ్చారు. రజిని మక్కల్ మండ్రామ్ (ఆర్‌ఎంఎం) అగ్ర నాయకత్వం నుండి హెచ్చరిక ఉన్నప్పటికీ, ఈ రోజు ఎన్నికల రాజకీయాల నుండి నిష్క్రమించాలన్న తలైవర్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనాలని తంజావూరుకు చెందిన ఒక పార్టీ కార్యకర్త రజనీకాంత్ అభిమానులను పిలిచారు.

2021 లో తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రజనీ తాను చురుకైన రాజకీయాల్లోకి ప్రవేశించబోనని ప్రకటించిన తరువాత ఆర్‌ఎంఎమ్‌లో కొంత అశాంతి నెలకొంది, ఇది రాజకీయాల్లో చేరాలని కోరుకునే అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రతిపాదిత నిరసనలో పాల్గొనవద్దని చాలా మంది ఆర్‌ఎంఎం సభ్యులు అభిమానులకు విజ్ఞప్తి చేశారు.