స్నేహితుడే కదా అని చనువు ఇస్తే అదే చివరకు అతడి కొంప ముంచుతుందని అనుకోలేదు. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ కుటుంబాన్ని నిలువునా కూల్చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని పీహెచ్‌ఈ కాలనీకి చెందిన అక్షయ్ సోంకున్వార్ అలియాస్ గోలు (26) బల్లభ్ భవన్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా పని చేసేవాడు. గోలుకు చిన్నతనం నుంచే సాగర్ అనే వ్యక్తి స్నేహితుడిగా ఉన్నాడు.
ఇద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారు. ఎవరి ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా ఇద్దరు వెళ్లేవారు. ఇందులో గోలుకు ఇటీవల వివాహం కూడా అయింది. ఇద్దరి మధ్య స్నేహం ఉండటంతో అదే చనువుతో అక్షయ్ ఇంటికి వెళుతూ ఉండేవాడు సాగర్. అక్కడ అక్షయ్ భార్య వసుధ( పేరు మార్చాం) తో సాగర్ సన్నిహితంగా ఉండేవాడు. ఆమెతో మాట్లాడుతూ.. అప్పుడప్పుడు జోక్స్ వేసుకుంటూ ఉండేవారు. అక్షయ్ మాత్రం తన స్నేహితుడే కదా అని సాగర్ ను పట్టించుకునే వాడు కాదు. దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్న సాగర్ ఆమెతో ప్రేమయాణం సాగించాడు. కొన్ని రోజుల తర్వాత వసుధపై అక్షయ్ కు అనుమానం వచ్చింది. ఆమెను అనుమానంతో నిలదీయడం మొదలు పెట్టాడు.
ఈ విషయం సాగర్ కు తెలియగా, అతడే రివర్స్ లో బయటకు తెలిస్తే పరువుపోతుందని బెదిరించడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి అక్షయ్ ఎక్కువగా మనస్తాపానికి గురయ్యాడు. తన భార్యని వదిలిపెట్టమని ఫ్రెండ్‌ని కూడా అడిగాడు. అయినా సాగర్ అతడి మాట వినలేదు. దీంతో అతడు ఎంతో బాధపడ్డాడు. ఇటు భార్య మాట వినక.. చిన్న తనం నుంచి స్నేహితుడు అనుకున్న వ్యక్తి మోసం చేయడంతో.. తట్టుకోలేక అతడు ఇంట్లోని గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు రిజిస్టర్ చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.