Fit India Movement: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
PM Narendra Modi Launches Fit India Movement.

New Delhi, August 29: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29, గురువారం రోజు ప్రధాని నరేంద్ర మోడీ “ఫిట్ ఇండియా ఉద్యమం” ((Fit India Movement) ప్రారంభించారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ సందర్భంగా న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. "ఈ రోజున భారత దేశం గర్వించే ఒక గొప్ప క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మించాడు. అతడు తన ఫిట్ నెస్, స్టామినా మరియు హాకీ స్టిక్ తో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు" అని మోదీ వ్యాఖ్యానించారు. ఫిట్‌గా ఉండటం కూడా మన సంస్కృతిలో ఒక భాగం, కానీ ఈరోజుల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కొన్నేళ్ల కిందట ఒక సాధారణ వ్యక్తి కూడా రోజుకు 8 నుంచి 10 కిలోమీటర్లు నడిచేవాడు, పరుగెత్తె వాడు మరియు సైక్లింగ్ చేసేవాడు.  కానీ పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఈ కాలంలో మనుషులకి శారీరక వ్యాయామం అనేదే లేకుండా పోయింది అని మోదీ పేర్కొన్నారు.

విజయానికి షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవని అందరూ కష్టపడాల్సిందేనని ప్రధాని అన్నారు. ఈ క్రమంలో మీరందరూ దృఢంగా ఉండాలి.  బలంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనసు ఆలోచనలు ఆకాశన్నైనా జయించాలని ఆలోచనలను కల్పిస్తుందని మోదీ పేర్కొన్నారు.

ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.

 

ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిరిజు, మరియు ఇతర భాజపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఫిట్ ఇండియా' ఉద్యమాన్ని ప్రజల సహాకారంతో మరింత ప్రాచుర్యం కల్పించి, ఆరోగ్యకరమైన భారత దేశాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ స్థాయిలో భారత్ సత్తా చాటిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు, స్ప్రింటర్ హిమా దాస్ మరియు రెజ్లర్లు సాక్షి మాలిక్ మరియు బజరంగ్ పునియా సహా పలువురు క్రీడా ప్రముఖులను అభినందించారు. ఈ సందర్భంగా ఫిట్ ఇండియా ప్రచారానికి క్రీడాకారులు తమ మద్ధతు తెలిపారు.