New Delhi, February 10: దేశంలో చమురు ధరలు మరికాస్త పెరగడంతో.. లీటరు పెట్రోల్, డీజిల్‌పై 31 పైసల చొప్పున పెంచినట్లు (Fuel Prices Hike) చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ పై 30 పైసల పెరుగుదల కనపడి రూ.87.60కి చేరింది. అలాగే, లీటరు డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.77.73గా ఉంది.
ముంబైలో లీటరు పెట్రోల్ రూ.94.12, డీజిల్ ధర రూ.84.63కి చేరింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 31 పైసలు పెరిగి రూ.91.09కి చేరింది. డీజిల్ ధర లీటరుకి 27 పైసలు పెరిగి రూ.84.79కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర 26 పైసలు పెరిగి రూ.89.96కి చేరింది. అలాగే, డీజిల్ ధర లీటరుకి 24 పైసలు పెరిగి 82.90కి చేరింది.
అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 30 పైసలు పెరుగుదలతో రూ.93.79కు చేరింది. డీజిల్ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.86.99కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 30 పైసలు పెరుగుదలతో రూ.93.36కు చేరింది. డీజిల్ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.86.58కు ఎగసింది.
కోల్‌కతా- పెట్రోల్ రూ.88.92, డీజిల్ రూ.81.31, జైపూర్- పెట్రోల్ రూ.93.98, డీజిల్ రూ. 85.95 పెరిగింది. కాగా నిన్న లీటర్ పెట్రోల్, డిజిల్‌పై 35 పైసల చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో ఈ ఏడాది ఇప్పటివరకు లీటర్ పెట్రోల్‌పై రూ.3.89, లీటరు డీజిల్‌పై రూ.3.91 పెరిగింది.
అంతర్జాతీయ ధరలు, విదేశీ మారక ధరల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరిస్తుంటాయి. అయితే వ్యాట్, ఇతర పన్నులతో వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. తాజాగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగానూ ఇంధన ధరలు పెరిగాయి.