Gold | Representational Image | (Photo Credits: IANS)

New Delhi, April 14: అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదొడుకులు.. డాలర్‌ ఇండెక్స్‌, యూఎస్ బాండ్లు బలహీన పడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు బంగారం (Gold Price) ఆల్టర్నేటివ్‌ పెట్టుబడి మార్గంగా కనిపిస్తున్నది. ఫలితంగా శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దాదాపు ఏడాది గరిష్ట స్థాయి రేట్‌ పలికింది. అమెరికా ఫెడ్‌ రిజర్వు తన వడ్డీరేట్ల (Intrest Rates) పెంపు ముగింపు దశకు  చేరుకున్నట్లు కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌ ధర 0.2 శాతం తగ్గినా 2034 డాలర్లు పలికింది. గతేడాది మార్చి 9 తర్వాత ఔన్స్‌ బంగారం 2000 డాలర్ల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి. యూఎస్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ఔన్స్‌ ధర 0.1 శాతం తగ్గి 2052.30 డాలర్లకు చేరుకున్నది. మరోవైపు, దేశీయ మార్కెట్‌లోనూ తులం బంగారం (24క్యారట్లు) పైపైకి దూసుకెళ్తున్నది.

'Modi Ji, Listen To Me': మోదీజీ.. దయచేసి మా కోసం ఓ చక్కని స్కూలు నిర్మించండి, వీడియో ద్వారా వేడుకున్న జమ్మూ కాశ్మీర్ చిన్నారి, సోషల్ మీడియాలో వైరల్  

చెన్నై, కోయంబత్తూర్‌, మదురై, ఈరోడ్‌లో రూ.62,500 పలికింది. పలు నగరాల్లో రూ.61,800 పలికింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.62 వేల మార్క్‌ను దాటింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.550 పెరిగి రూ.56,650 పలికింది. ఈ ధరల్లో జీఎస్టీ (GST), స్థానిక పన్నులు కలుపలేదు. ఆయా ప్రాంతాల్లో ఆభరణాల తయారీ సంస్థలకు అనుగుణంగా ధరల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధ‌ర 410 రూపాయ‌లు పెరిగి రూ.77,580 వ‌ద్ద స్థిర ప‌డింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధ‌ర 25.88 డాల‌ర్లు ప‌లుకుతున్న‌ది. డాల‌ర్‌, యూఎస్ బాండ్ల సూచీల ధ‌ర క్షీణించ‌డం వ‌ల్లే బంగారానికి గిరాకీ పెరిగింద‌ని బులియ‌న్ మార్కెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు.