తాజాగా బంగారం ధరలు దేశ వ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 48,200 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 53,580 రూపాయలుగా ఉంది. బంగారం కొనుగోళ్లకు ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
నిజానికి బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? తగ్గుతాయో? చెప్పలేం. తగ్గడం తక్కువగా, పెరగడం ఎక్కువగా చూస్తుంటాం. అందుకు కారణం బంగారానికి ఉన్న డిమాండ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో పాటు భారత్ లో మరింత మక్కువ ఉండటంతో వీటి కొనుగోళ్లు సీజన్ కు సంబంధం లేకుండా సాగుతుంటాయి. గతంలో పెళ్లిళ్ల సీజన్, మంచి రోజుల్లోనే డిమాండ్ ఉండే బంగారానికి ప్రస్తుతం అవేమీ లేవు. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేస్తుండటంతో జ్యుయలరీ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడిపోతుంటాయి.