Representational Image (Photo Credits: Pixabay)

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Price) రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.45,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,690 గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.150 పెరిగితే, 24 క్యారెట్లపై రూ.160 మేర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ల మార్కెట్‌ విక్రయానికి అనుమతి

>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690 వద్ద కొనసాగుతోంది.

>> ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690 ఉంది.