New Delhi, June 19: దేశం నిరుద్యోగ (Unemployment) భారతంగా మారి…కోట్లాది మంది ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారన్నది ప్రస్తుతం కంటికి కనిపిస్తున్న దృశ్యం. దేశవ్యాప్తంగా జరుగుతున్న అగ్నిపథ్ (Agneepath) ఆందోళనలు చూస్తుంటే నిరుద్యోగం (Unemployment) ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి నిరుద్యోగులకు ఎందుకు ఉపాధి దొరకడం లేదు.. భర్తీ చేయడానికి ఉద్యోగాలు లేవా అంటే కచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ (Central Govt) పరిధిలోనే వివిధ శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టులు లక్షల్లో ఉన్నాయి. 2019, 2020 ఈ రెండు సంవత్సరాల్లోనే… సైనిక బలగాలను మినహాయించి.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు 9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా(Vacant) ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇక సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌ను కూడా కలుపుకుంటే.. పది లక్షల ఉద్యోగాలు (Jobs) ఖాళీగా ఉన్నాయి. ఈ నెంబర్ కేవలం.. 2019, 2020 మాత్రమే. ఆ తర్వాత డేటాను కూడా కలుపుకుంటే ఖాళీల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది..

Bulldozer Baraat: బుల్డోజర్‌ లో పెళ్లి ఊరేగింపు, యోగి ఇలాఖాలో ముస్లిం యువకుడి వినూత్న ఊరేగింపు, అనుబంధాలు పెంచుకునేందుకు కూడా బుల్డోజర్ పనికొస్తుందంటూ సందేశం  

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయన్న డేటాను విశ్లేషిస్తే…ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వాలు ఎంత ఉదాశీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2006లో 4.17 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే… 2020 నాటికి ఆ ఖాళీలు.. దాదాపు 9 లక్షలకు చేరుకున్నాయి. 2001లో ఐదు శాతం ఖాళీలు ఉంటే.. 2013 నాటికి అవి 16.2 శాతానికి పెరిగాయి. అయితే 2014 నుంచి 16 మధ్య కాలంలో ఉద్యోగాల భర్తీ కొంత మేర జరగడం వల్ల.. ఖాళీల శాతం 12కి పడిపోయింది.

Agneepth Scheme: ఇకపై ఆర్మీలో రెగ్యులర్ నియామకాలు ఉండవు! అగ్నిపథ్ స్కీమ్ పై ఉన్నతాధికారుల క్లారిటీ, ఆందోళనల్లో పాల్గొంటే ఉద్యోగాలు రావు, అగ్నిపథ్ స్కీమ్ బెనిఫిట్స్ వివరించిన త్రివిధ దళాల అధికారులు  

అయితే ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా పెరుగుతూ 20 శాతానికి చేరుకున్నాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు.. భర్తీ చేస్తున్న వాటికి పొంతనే ఉండటం లేదని ఈ లెక్కలను చూస్తే అర్థమవుతుంది. వచ్చే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇటీవలే మోదీ అధికారులను ఆదేశించారు. పెట్టుకున్న లక్ష్యం ప్రకారం ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా చూడాలి..