GST Revenue Collection - Representational Image. | (Photo Credits: PTI/File)

Mumbai, January 1: గూడ్స్ మరియు సర్వీస్ టాక్సుల (GST) ద్వారా వచ్చిన ఆదాయం (Revenue Collection) డిసెంబర్ లో రూ. 1 లక్ష కోట్లను దాటింది. వసూళ్లు లక్ష కోట్లు దాటడం వరుసగా ఇది రెండో సారి, నవంబర్ నెలలో కూడా లక్ష కోట్లు వసూలయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019లో డిసెంబర్ నెల ఆదాయం రూ .1.03 లక్షల కోట్లకు పెరిగింది. 2018 డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ .97,276 కోట్లుగా ఉంది. పండుగ సీజన్ లో కొనుగోళ్లు ఎక్కువగా జరగడమే ఇందుకు కారణం అని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.

2019 నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1,03,492 కోట్లు. సిజీఎస్టీ ద్వారా వసూళ్లు రూ. 19,962 కోట్లు, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ. 26,792 కోట్లు, ఐజీఎస్టీ రూ. 48,099 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన సుంకం రూ. 21,295 కోట్లు కలిపి), సెస్ ద్వారా రూ. 8,331 కోట్లు వసూళ్లు అయ్యాయని ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడైంది.

Read the Tweet Below:

 

రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్లు ఇలా ఉన్నాయి:

 

దేశీయ లావాదేవీల ద్వారా 2019 డిసెంబర్ నెలలో జీఎస్టీ ఆదాయం, 2018 డిసెంబర్ నెలలో ఆదాయంతో పోలిస్తే 16 శాతం వృద్ధిని చూపించింది. దిగుమతుల నుండి రాబట్టిన ఐజీఎస్టీని పరిగణనలోకి తీసుకుంటే, 2019 డిసెంబర్‌లో మొత్తం ఆదాయం 9 శాతం పెరిగింది కానీ, దిగుమతులపై ఐజీఎస్టీ వసూళ్లలో 10 శాతం క్షీణతను కనబరిచింది, అయితే నవంబర్‌లో 13 శాతం క్షీణత, అక్టోబర్ నెలలో 20 శాతం క్షీణతలతో పోల్చితే డిసెంబర్ లో కాస్త మెరుగుదల కనిపించింది.

రెగ్యులర్ సెటిల్మెంట్ల తర్వాత 2019 డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంపాదించిన మొత్తం ఆదాయం సెంట్రల్ జీఎస్టీ ద్వారా రూ .41,776 కోట్లు, స్టేట్ జీఎస్టీ ద్వారా రూ .42,158 కోట్లు అని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి.