Chhattisgarh launches portal for home delivery of liquor to avoid crowding during lockdown (Photo-ANI)

Gandhi Nagar, July26: గుజరాత్ రాష్ట్రంలోని బొటాడ్‌లో విషాదం (Gujarat hooch Tragedy) చోటు చేసుకుంది. బొటాడ్‌ జిల్లాలో కల్తీ మద్యం తాగి 21 మంది మృత్యువాత(Death toll rises to 21) పడ్డారు. మరో 40 మంది ఆస్పత్రి పాలయ్యారు. మృతులకు మద్యానికి బదులుగా రసాయనాలను విక్రయించారని ప్రాథమిక గుజరాత్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు.ఆదివారం రాత్రి కెమికల్ తాగి అస్వస్థతకు గురయ్యారని గుజరాత్ పోలీసు వర్గాలు తెలిపాయి. బాధితులకు విషపూరిత మద్యంలో (consuming illicit liquor) ఉండే మిథైల్‌ను ఎమోస్‌ అనే కంపెనీ సరఫరా చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది.

గోడౌన్ మేనేజర్ జయేష్ అకా రాజు తన బంధువు సంజయ్‌కు రూ.60 వేలకు 200 లీటర్ల మిథైల్‌ను సరఫరా చేశాడు.సంజయ్ అతని సహచరుడు పింటూ, మిథైల్ రసాయనాలతో నిండిన పౌచ్‌లను దేశంలో తయారు చేసిన మద్యం పేరుతో ప్రజలకు విక్రయించారు. నాటు సారా తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్‌ డీజీపీ ఆశిష్‌ భాటియా తెలిపారు. ‘కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 21 మంది మరణించారు. మరో 40 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చేరారు. స్థానిక పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.’ అని పేర్కొన్నారు.

తాగుబోతు కొడుకుని చంపి శవాన్నిముక్కలుగా నరికేసిన తండ్రి, పాలిథిన్‌ బ్యాగుల్లో ఆ ముక్కలను వివిధ ప్రాంతాల్లో పడేశాడు, ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు

బొటాడ్‌ జిల్లా రోజిడ్‌ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొంత మంది ఆదివారం రాత్రి అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయమే ఇద్దరు మరణించారు. మిగిలిన వారు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలుగా పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి రోజిడ్‌ గ్రామంలో నాటు సారా తాగిన తర్వాత తన భర్త అనారోగ్యానికి గురైనట్లు ఓ మహిళ.. పోలీసులకు తెలిపింది. మరోవైపు.. ఆదివారం రాత్రి ఓ కొట్టులో నాటు సారా కొనుగోలు చేసిన తర్వాత సుమారు 25 మందికిపైగా అనారోగ్యానికి గురైనట్లు ఓ బాధితుడు తెలిపారు.

సోమవారం సాయంత్రం బొటాడ్‌ సివిల్‌ ఆసుపత్రిని సందర్శించి వివరాలు సేకరించారు భవనగర్‌ రేంజ్‌ ఐజీ అశోక్‌ కుమార్‌ యాదవ్‌. డిప్యూటీ ఎస్పీ ర్యాంక్‌ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గుజరాత్‌ పర్యాటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నాటు సారా అమ్ముతున్నట్లు ఆరోపించారు.

Here's Delhi CM Tweet

ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. గుజరాత్‌లో కల్తీ మద్యం కారణంగా 23 మందికి పైగా మరణించడం, 40 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందడం చాలా బాధాకరం.నేను మరణించిన వారందరికీ నివాళులర్పిస్తున్నాను మరియు ఈ దుఃఖ సమయంలో బాధితులకు నా సానుభూతిని తెలియజేయడానికి ఈ రోజు భావ్‌నగర్ ఆసుపత్రికి వెళ్తున్నాను అని తెలిపారు.