Lucknow, Nov 8: ఉత్తర ప్రదేశ్ వారణాసి జ్ఞానవాపి కేసుపై విచారణను నవంబర్ 14 తేదీకి వాయిదా వేసింది వారణాసి కోర్టు. మసీదు ప్రాంగణంలో ఉన్న శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలని, హిందువులకు ఆ ప్రాంగణం అప్పగించాలని, అలాగే ముస్లింల ప్రవేశాన్ని నిషేధించేలా ఆదేశాలు ఇవ్వాలని.. మొత్తం మూడు డిమాండ్లతో హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది.అయితే జడ్జి అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతానికి ముస్లిం వర్గాలకు అక్కడ నమాజ్‌కు అనుమతి ఇస్తున్నారు.
ఈ మేరకు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) మహేంద్ర పాండే తీర్పును అక్టోబర్ 27న రిజర్వ్ చేసి ఉంచారు.ముందుగా నవంబర్ 8వ తేదీన తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే జడ్జి అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14వ తేదీకి వాయిదా పడింది. తరపున పిటిషన్ వేసిన వీవీఎస్‌ఎస్ వాదనను తోసిచ్చుతోంది.