Dead Body. (Photo Credits: Pixabay)

Fatehabad, FEB 01: హర్యానాలోని ఫతేహాబాద్‌లో (Fatehabad Accident) ఓ వాహనం కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మహిళలు సహా తొమ్మిది మంది మృతి చెందారు. ఇద్దరిని రక్షించగా.. మరో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. వీరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఫతేహాబాద్‌ జిల్లాలో మెహమరా గ్రామానికి చెందిన 14 మంది.. పంజాబ్‌లో (Punjab) ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం సర్దారేవాలా గ్రామ సమీపంలోకి రాగానే అదుపుతప్పి భాక్రా కాలువలోకి దూసుకెళ్లింది (vehicle plunges into canal). దట్టమైన మంచు ఉండటం, నియంత్రణ కోల్పోవడంతో వాహనం ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

Cruiser Plunges Into Bhakra Canal in Haryana 

 

విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు... గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ప్రమాద ఘటన నుంచి సుమారు 50 కి.మీ దూరంలో కొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. తొమ్మిది మంది మృతి చెందినట్లు గుర్తించగా.. గల్లంతైన వారి కోసం 50 మంది రెస్క్యూ బృందం గాలింపు కొనసాగిస్తోందని అధికారులు వెల్లడించారు.