Haryana December 23: ఒమిక్రాన్(Omicron) భయాలతో పలు రాష్ట్రాలు కొత్త ఆంక్షలను(curbs) విధిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 15 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదైన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. హర్యానాలో తొలి ఒమిక్రాన్ కేసు(First omicron case in Haryana) నమోదైందవ్వడంతో, ఆంక్షలను కఠినతరం చేశారు. కెనడా నుంచి ఫరీదాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్(Corona Positive) రాగా.. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడంతో ఒమిక్రాన్ అని తేలింది. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చర్యలను తీసుకుంటున్నారు.
Govt of Haryana makes the second dose of #COVID19 vaccination mandatory from 1st January 2022. The State Govt decides to allow only fully vaccinated people at public places since that day. Only fully vaccinated persons will be allowed to travel from bus stands & railway stations. pic.twitter.com/rJy3Ltt7Hg
— ANI (@ANI) December 22, 2021
వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు పలు నిబంధనలను విధించారు. వ్యాక్సిన్ తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తామని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు జనవరి 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లోకి రావాలంటే రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్(Vaccination certificate) తప్పనిసరి చేశారు. పబ్లిక్ ఎక్కువగా ఉండే బస్టాండ్లు(Bus stannds), రైల్వే స్టేషన్లు, ఇతర ప్రదేశాల్లోకి ప్రవేశించే ముందు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాలని నిబంధన విధించారు.
కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులు వేయించుకుంటేనే మాల్స్, మ్యారేజ్ హాల్స్, హోటల్స్, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు, బస్సుల్లోకి రానిస్తామని హర్యానా మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఒమిక్రాన్, కరోనా థర్డ్ వేవ్(Covid-19 Third wave)ను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తమ రాష్ట్రంలో కరోనా బారినపడిన మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేలు పరిహారం అందిస్తామని, బీపీఎల్ కుటుంబాలకు రూ.2 లక్షలు, కొవిడ్ వారియర్స్ కుటుంబాలకు రూ.20 లక్షలు, హెల్త్ వర్కర్స్‌కు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు.