Delhi Omicron Fear: న్యూఇయర్, క్రిస్మస్‌ వేడుకలపై ఢిల్లీలో నిషేదం, గుంపులుగా కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన యంత్రాంగం, ఆరు నెలల గరిష్టానికి చేరిక కరోనా కేసులు
Delhi Police | Representational Image | (Photo Credits: PTI)

New Delhi December 22:  భారత్ లో ఒమిక్రాన్ డేంజర్ బెల్స్(Omicron fear) మోగిస్తోంది. 11 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్(Omicron) వ్యాప్తి చెందింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అధికంగా ఢిల్లీ(Delhi)లోనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కోవిడ్ విషయంలో సేఫ్ జోన్‌గా ఉన్న ఢిల్లీ, ఇప్పుడు మరోసారి డేంజర్ జోన్‌(Danger Gone)లోకి వెళ్తోంది. అక్కడ ఆరు నెలల గరిష్టానికి కోవిడ్ కేసులు చేరాయి. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 125 కరోనా కేసులు(Corona Cases) నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన సర్కారు కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేసింది.

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేదం(Christmas, New Year celebrations banned) విధించింది. క్రీడా, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ప్రజలు గుమికూడటం, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించాలన్న నిబంధనను తప్పనిసరి చేసింది(Mask Must). ఈ మేరకు దిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.

Omicron Symptoms: గొంతు దగ్గరే ఆగిపోతున్న ఒమిక్రాన్, ఊపిరితిత్తులకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్న ఎయిమ్స్ డాక్టర్లు

ఢిల్లీ పాలనాయంత్రాంగం, పోలీసులు ఈ ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. అలాగే జిల్లా అధికారులు రోజూవారీ నివేదికలను సమర్పించాలని తెలిపింది. మాస్క్ ధరించని వినియోగదారుల్ని అనుమతించవద్దని మార్కెట్‌ ట్రేడ్ అసోసియేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో ఇప్పటివరకు 215 మంది ఈ కొత్త వేరియంట్‌ బారినపడ్డారు. వారిలో సుమారు 90 మంది కోలుకున్నారు. ఢిల్లీ తర్వాత మహారాష్ట్రలో 54 మందికి ఈ వేరియంట్ సోకింది. మొత్తంగా 15 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించింది. దీనిపై ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది.