రోజంతా యాక్టివ్ గా ఉండాలి అంటే మనము బ్రేక్ ఫాస్ట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే ఆరోగ్యకరమైన పోషకపకారమైన ఆహారంతో మన రోజున ప్రారంభిస్తే అనేక రకాలైనటువంటి లాభాలు జరుగుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలతో నిండిన అల్పాహారం తీసుకోవడం వల్ల మన జీవక్రియ మెరుగుపడుతుంది. అలా కాకుండా మన అల్పాహారాన్ని సరిగ్గా తీసుకోకపోతే అనేక రకాల హాని జరుగుతుంది. ముఖ్యంగా బరువు పెరుగుతూ ఉంటారు. ఎక్కువగా ఆయిల్ ఫుడ్లను చక్కర పదార్థాలను ఉదయం పూట తింటుంటారు. కానీ ఇది మన శరీరానికి చాలా హానికరం. అయితే ఉదయం పూట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆహార పదార్థాలను తినకండి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్వీట్లు- ఉదయం అల్పాహారంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తీపి ఆహార పదార్థాలను అస్సలు తినుకోకు తినకూడదు. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఖాళీ కడుపుతో స్వీట్లను తీపి ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో గ్లూకోస్ స్థాయిలో పెరుగుతాయి.
ఆయిల్ ఫుడ్స్- అదేవిధంగా ఉదయము అల్పాహార సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయిల్ ఫుడ్లను తీసుకోకూడదు పూరి, వడ, బోండా వంటి ఆయిల్ ఫుడ్లకు దూరంగా ఉంటే మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆయిల్ ఫుడ్స్ ని తీసుకోవడం వల్ల వికారంగా, వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
Health Tips: అండర్ ఆర్మ్స్ నల్లగా ఉండడానికి కారణాలు.
ఖాళీ కడుపుతో టీ కాఫీలు తాగవద్దు- చాలామందికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ టీ తాగడం అని ఇష్టపడతారు. అయితే ఇది అనేక నష్టాలను కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో కాఫీ టీ తీసుకోవడం ద్వారా నొప్పి, గ్యాస్ ప్రాబ్లం అంటే సమస్యలు వస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి అందాల్సిన పోషకాహారం సరిగ్గా అందదు. కాబట్టి ఖాళీ కడుపుతో తీసుకోకూడదు..
అల్పాహారంగా ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి- అల్పాహారంలో పోహా, ఓట్స్ వంటి వాటిని తీసుకోవడం మంచిది. అంతే కాకుండా మొలకెత్తిన గింజలు తీసుకోవడం కూడా ఉత్తమం. పండ్లు ,ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మీ శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. మొలకెత్తిన గింజల్లో పెరుగు, కూర మొక్కలు లాగా చేసుకుని తినొచ్చు అంతేకాకుండా మల్టీ గ్రైన్ పిండితో చేసిన చపాతీలను కూడా తీసుకోవచ్చు. ఇవి మీకు శక్తిని అందించటం పాటు మీ శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి