amla

ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయ నీటిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఉసిరిని ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలున్న పండుగ చెప్తారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ ప్రోటీన్ విటమిన్ సి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియకు చర్మానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు ఉసిరి రసం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇమ్యూనిటీ- ప్రతిరోజు తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి అనేక రకాల ఇన్ఫెక్షన్లు సీజనల్ వ్యాధుల్లో పోరాటానికి కావలసిన బలాన్ని అందిస్తుంది. ప్రతిరోజు ఉసిరికాయ రసాన్ని తీసుకోవడం ద్వారా శక్తి పెరిగి తరచుగా వచ్చేటువంటి వ్యాధులతో పోరాటం చేయడానికి సిద్ధపడుతుంది. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం ద్వారా మీరు శక్తివంతంగా ఉంటారు.

జీర్ణ క్రియ కు- ఉసిరి రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైన జీర్ణక్రియ ఉంటుంది. మలబద్ధకం కడుపుబ్బరం కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గించడంలో ఈ ఉసిరి రసం సహాయపడుతుంది.

Health Tips: బొప్పాయి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

ఆరోగ్యకరమైన జుట్టు చర్మం- సిట్రస్ పండ్లను అధికంగా తీసుకోవడం ద్వారా చర్మం జుట్టుకు బలాన్ని అందిస్తుంది ఉసిరికాయ రసాన్ని తీసుకోవడం ద్వారా అందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ జుట్టు పోషణకు సహకరిస్తాయి. విటమిన్ సి కొత్త కణాలను కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టును నలుపుగా మార్చే గుణం విటమిన్ సి కి అధికంగా ఉంటుంది.

బరువు తగ్గుతారు- అధిక బరువుతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసాన్ని తీసుకున్నట్లయితే మీ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. తినాలని కోరిక తగ్గిస్తుంది. ఈ ఆసిడ్ జీవాక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి