Cancer (Photo-PTI)

ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులు మనం చేసే కొన్ని తప్పిదాల వల్లనే వస్తున్నాయి. మారిన జీవనశైలి ఆహారంలో మార్పు ఒత్తిడి వ్యాయామం లేకపోవడం వంటి సమస్యలతో ఈ ప్రమాదకరమైన జబ్బులు ఇబ్బంది పెడుతున్నాయి. మనం రోజువారి జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. అటువంటి అలవాట్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ధూమపానం ,మద్యపానం- మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో మద్యం ధూమపానం వంటివి చాలా జబ్బులకు కారణంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండెపోటు ఇతర రోగాలు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. సిగరెట్ పొగ నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తులను ఇబ్బందికి గురిచేస్తుంది. మద్యం తాగడం వల్ల లివర్ వంటి సమస్యలు ఏర్పడతాయి. ఊపిరితిత్తులు గొంతు పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు గుండెపోటు వచ్చే సమస్య కూడా ఉంటుంది. అటువంటి ఎప్పుడు ధూమపానం మద్యపానం కి దూరంగా ఉండటం ద్వారా మనము అనేక రకాల జబ్బుల నుండి బయటపడవచ్చు.

Health Tips: చలికాలంలో పిల్లల్లో ఎక్కువగా జలుబు, దగ్గు సమస్య ...

పోషక ఆహారం- మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. తద్వారా జీవనశైలి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారంలో మనం ఎక్కువగా ప్రోటీన్, పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉండేలాగా చూసుకోవాలి. దీనికోసం తృణధాన్యాలు తాజా పండ్లు, కూరగాయలను డ్రైఫ్రూట్స్ వంటి వాటిని చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా ఉంటాయి.

వ్యాయామం- శరీరానికి వ్యాయామం అనేది రోగనిరోధక వ్యవస్థను బలపరిచేలాగా ఉంటుంది. మన బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు పెరిగినప్పుడు ఊబకాయం, గుండెపోటు, రక్తపోటు, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారానికి కనీసం 200 నిమిషాల పాటు నడకా లేదా సైక్లింగ్ వంటివి చేసినట్లయితే మీకు అనేకరకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

ఒత్తిడి తగ్గించుకోవడం- మారుతున్న జీవనశైలిలో ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మన శరీర ఆరోగ్యాన్ని మనసును తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తుంది. మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఒత్తిడి వల్ల క్యాన్సర్ గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి. షుగర్ పెరగడము, ఊబకాయము వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఇది అనారోగ్యానికి గురిచేస్తుంది. ఒత్తిడి నుంచి తగ్గించుకోవడానికి యోగ మెడిటేషన్ ప్రాణాయామం వంటివి చేసినట్లయితే అనేక రకాల జబ్బుల నుండి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి