చాలామంది కాకరకాయ అంటేనే ఇష్టపడరు. అయితే ఇది రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఇందులో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది ఒక ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది గా చెప్పవచ్చు. కాకరకాయలో అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే దీన్ని ఎక్కువగా తినడం వల్ల కొన్ని సార్లు ప్రతికూల ప్రభావాలు కూడా వస్తాయి. అయితే కొంతమంది ఈ కాకరకాయను తీసుకోవడం అంతా మంచిది కాదు. దీని వల్ల జరిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణీలు- గర్భిణీలు కాకరకాయ తీసుకోవడం మానుకోవాలి ఎందుకంటే ఇది కడుపులో ఉన్న బిడ్డ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా ఇది కొద్దిగా వేడి లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి గర్భశయాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాకరకాయలు తినకూడదు.
Health Tips: రక్తంలో షుగర్ లెవెల్ భారీగా పెరిగిపోయిందా.
కిడ్నీలో స్టోన్స్- కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాకరకాయని తినకూడదు. కాకరకాయలో ఆక్సలైట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో స్టోన్స్ సమస్య ఉన్న వారిని ఇంకా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా ఇది కిడ్నీలను ఇన్ఫెక్షన్ గురిచేస్తుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కాకరకాయకి దూరంగా ఉండాలి.
మధుమేహం- మధుమేహ సమస్య ఉన్నవారు కూడా ఈ కాకరకాయను తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే కొంతమందిలో కంట్రోల్లో షుగర్ ఉంటుంది. అటువంటి వారు కాకరకాయను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర స్థాయిలో అకస్మాత్తుగా పడిపోతాయి. దీనివల్ల కళ్ళు తిరగడం, మైకము, బలహీనత వంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి టైప్ వన్ షుగర్ ఉన్నవారు కాకరకాయలు తగ్గిస్తే మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి