1 dead in Tamil Nadu after heavy rains, coastal districts on alert (Photo-ANI)

Chennai, December 1: తమిళనాడు(Tamil Nadu)లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామనాథపురం, మధురైలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాల వల్ల పలు చోట్ల స్వల్ప ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో గోడలు కూలిన ఘటనల్లో వికలాంగరాలితో సహా ఇద్దరు మృత్యువాత పడ్డారు. తంజావూర్‌ జిల్లాలోని ఒక గ్రామంలో గోడ కూలి మీద పడటంతో దురైకన్ను అనే వ్యక్తి మృతి చెందాడు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు(Warning for fishermen) జారీ చేశారు.

నాగపట్నం, తిరువరూర్‌, పుదుకొట్టారు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో గోడలు కూలిన ఘటనల్లో వికలాంగరాలితో సహా ఇద్దరు మృత్యువాత పడ్డారు. వల్లం, తంజావూర్‌ల్లో శుక్రవారం అధిక వర్షపాతం (97 మిమి) నమోదైందని సంబంధిత అధికారులు(Regional Meteorological Centre) తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ (Tamil Nadu, Puducherry and Karaikal, Kerala)ఉత్తర ప్రాంత జిల్లాలు, లక్షద్వీప్ లల్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

ANI Tweet

ఇప్పటికే అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాయలసీమ(Rayalasema)లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షపాతం నమోదైందని తెలిపారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శనివారం భారీగా వర్షం కురిసింది. తీర ప్రాంత జిల్లాలపైనా అల్పపీడన ద్రోణి ప్రభావం కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. శనివారం నుంచి తేలికపాటి జల్లులు పడుతున్నాయి.

భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయం

ఇదిలా ఉంటే తమిళనాడు, శ్రీలంక తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు కోమరిన్‌ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది.

చెరువుల్ని తలిపస్తున్న రోడ్లు

ఇక పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, పుదుచ్చేరిలపైనా అల్పపీడన ద్రోణం ప్రభావం కనిపిస్తోంది. బెంగళూరు సహా తీర ప్రాంత జిల్లాల్లో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మంగళూరు, భత్కల్, ఉడుపి వంటి కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి.