Horoscope Today: ఈ రాశులు వారికి అదృష్టం వరిస్తుంది, వారు అనుకున్నది సాధిస్తారు, పట్టిందల్లా బంగారం అవుతుంది, ఈ రోజు ఏయే రాశులవారికి మంచి జరుగుతుందంటే..
Zodiac Signs (Photo Credits: Pixabay)

నేడు జూన్ 16 గురువారం గ్రహాలు,నక్షత్రాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? ఏయే రాశుల వారికి సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి? ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి? ఆ వివరాలను నేటి దినఫలాల్లో తెలుసుకుందాం. ఇవాళ కొన్ని రాశుల అదృష్టం బాగా కలిసి వస్తుంది. పట్టుదలతో అనుకున్న దానిని సాధిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా అనుకూల సమయం నడుస్తోంది. కొందరు మాత్రం ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మేషం: విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశి౦చిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. బంధువులతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సంతానం పురోగతి సాధిస్తారు.

వృషభం: సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో అనుకూలమైన కాలం నడుస్తోంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రులు సహాయమందిస్తారు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆవేశకావేషాలకు దూరంగా ఉండాలి.

ఈ రాశుల వారికి బుధవారం పట్టిందల్లా బంగారమే, ఈ రాశుల వారు స్నేహితులతో వ్యాపారంలో మోసపోయే చాన్స్, ఈ రాశుల వారు దూరప్రయాణాలు చేయొద్దు, మీ రాశి ఫలాలు ఇక్కడ చెక్ చేసుకోండి...

మిథునం: మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధవహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. ఉద్యోగపరంగా కొంత ప్రతికూలత ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం: కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. ఆర్జికంగా నిలకడగా ఉంటుంది కానీ, కొన్ని అనవసర ఖర్చులు తప్పవు. ఆరోగ్యం ఫరవాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయ౦ చేస్తారు. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది.

సింహం: మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. ఉద్యోగంలో కొంత జ్యాగ్రత్త అవసరం. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. ఆస్తి విలువ పెరుగుతుంది. పట్టుదలతో అనకున్నది సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలవారు అభివృద్ధి సాధిస్తారు.

కన్య: ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇల్లు మారడానికి అవకాశం ఉంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. సంతానం పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల వారి పరిస్టితి మెరుగ్గా ఉంటుంది.

తుల: ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా శ్రమ ఉంటుంది. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి.

వృశ్చికం: ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచింది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త పనులు చేపట్టడంలో ఆచితూచి అడుగేయాలి. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు గుర్తుకు వచ్చి బాధపడతారు. వైద్యం మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార లాభ౦ కనిపిస్తోంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది.

ధనుస్సు: నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగుల సహకారం ఉంటుంది. ధన లాభం ఉంటుంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. కుటుంబానికి సంబంధించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

మకరం: చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకోకుండా సంపాదన పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. వ్యాపారులకు అన్నివిధాలా బాగుంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి.

కుంభం: వ్యవసాయరంగలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ససలమవుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

మీనం: అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్పల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ఒక కుటుంబ సమస్య కొద్దిగా చికాకు కలిగిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ప్రస్తుతానికి ఎవరికీ హామీ ఉండవద్దు.

నోట్: ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనికి లేటెస్ట్‌లీ ధృవీకరించలేదు. ఇది వాస్తవమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, ప్రజల విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది.