Hyundai Alcazar Facelift

New Delhi, AUG 22: దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి తన హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ (Alcazar Facelift) లిఫ్ట్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది. హ్యండాయ్ ఫ్లాగ్ షిప్ త్రీ రో ఎస్‌యూవీ కారు ఆవిష్కరణ తేదీ ఖరారు కావడంతో ప్రీ బుకింగ్స్ (Pre Bookings) ప్రారంభం అయ్యాయి. రూ.25 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా గానీ, హ్యుండాయ్ డీలర్ల వద్ద గానీ ప్రీ బుకింగ్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ తొమ్మిదో తేదీన హ్యుండాయ్ అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ కారు (Hyundai Alcazar Facelift) ఆవిష్కరిస్తారు. గత జనవరిలో న్యూ క్రెటా ఆవిష్కరించిన తర్వాత అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరణ ప్రధానం కానున్నది.

 

2022లో తొలి మూడు వరుసల ఎస్‌యూవీ అల్కాజర్‌ను హ్యుండాయ్ తొలిసారి భారత్ మార్కెట్లోకి తెచ్చింది. నాటి నుంచి ఇప్పటి వరకూ 75 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. సిక్స్ సీట్, సెవెన్ సీట్ లే ఔట్లతో మార్కెట్లోకి వచ్చింది హ్యుండాయ్ అల్కాజర్. మహీంద్రా ఎక్స్‌యూవీ 700, టాటా సఫారీతోపాటు మరో మూడు యుటిలిటీ వాహనాలకు గట్టి పోటీ ఇస్తోంది హ్యుండాయ్ అల్కాజర్. హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారు నాలుగు వేరియంట్లలో వస్తోంది. ఎగ్జిక్యూటివ్, ప్రిస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ వేరియంట్లలో వస్తోంది. నాన్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్ లోనూ అందుబాటులో ఉంటుంది. రోబస్టర్ ఎమరాల్డ్ మ్యాట్టె కలర్ థీమ్‌లోనూ లభిస్తుందీ కారు.