త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో ఆర్మీ హెలికాప్ట‌ర్ ఎంఐ-17 వీ5 కూలిన ఘ‌ట‌న‌లో (IAF Helicopter Crash) సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్‌తో పాటు మొత్తం 13 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న‌పై అసంబ‌ద్ధ ప్ర‌చారాలు జ‌రుగుతున్న‌ట్లు ఇవాళ వాయుసేన త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. నిరాధార ఆరోప‌ణ‌ల‌ను ఆపేయాల‌ని ఆ ట్వీట్‌లో ఐఏఎఫ్ కోరింది. దర్యాప్తు యుద్ధప్రాతిపదికన సాగుతోందని, అనవసర ఊహాగానాలు వద్దని సూచించింది. ‘‘ప్రమాదంపై ట్రై సర్వీస్ (త్రివిధ దళాల) కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని (IAF Constitutes Tri-Service Probe) ప్రారంభించాం. మొన్న (డిసెంబర్ 8) జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం. దర్యాప్తును వేగంగా చేస్తున్నాం.

త్వరితగతిన విచారణ పూర్తి చేస్తాం. త్వరలోనే అన్ని వాస్తవాలను బయటపెడతాం. అప్పటిదాకా చనిపోయిన వారి గౌరవమర్యాదలను కాపాడండి. అనవసర ఊహాగానాలను ఆపేయండి’’ అంటూ ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. త్వ‌ర‌లోనే ప్ర‌మాద ఘ‌ట‌న‌కు చెందిన వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పింది. రావ‌త్ ( CDS General Bipin Rawat) దంప‌తుల‌తో పాటు ర‌క్ష‌ణ‌ద‌ళ సిబ్బంది మృతి ప‌ట్ల త్రివిధ‌ద‌ళ ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ తెలిపిన విష‌యం తెలిసిందే. త్వ‌రిత‌గ‌తిన ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ‌ను పూర్తి చేయ‌నున్న‌ట్లు ఐఏఎఫ్ తెలిపింది. దీని కోసం ద‌ర్యాప్తు క‌మిటీని కూడా ఏర్పాటు చేసిన‌ట్లు ఐఏఎఫ్ చెప్పింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)