Hyd, Sep 27: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (IIFA) ఉత్సవం 2024 ఇవాళ్టి నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. నేటి నుండి మూడు రోజుల పాటు ఐఫా ఉత్సవం జరుగనుండగా తొలిరోజు దక్షిణ భారతదేశ చిత్రాలకు సంబంధించిన అవార్డుల కార్యక్రమం ఉండనుంది. తమిళం, తెలుగు, మలయాళం , కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఇక ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది రెజీనా కసాండ్రా. తన అందచందాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసిన రెజీనా..ఐఫా ఉత్సవంలో వేదికపై 8 నిమిషాల పాటు వివిధ పాటలకు డ్యాన్స్ చేయనుంది.ఐఫా ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటుడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు, ఇంప్రెసివ్‌గా షారుఖ్ ఫోటోలు
Here's Video:
View this post on Instagram
విజిల్ పోడు , "సనా కస్తమ్ వంటి తమిళ సాంగ్స్‌కు డ్యాన్స్ చేయనుంది రెజీనా. మెగాస్టార్ చిరంజీవి, ఇళయ దళపతి విజయ్ లాంటి స్టార్స్ ముందు డ్యాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా అని తెలిపారు రెజీనా.
అలాగే రంజితమే , గువ్వా గోరింకతో , అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రిహార్సల్ పూర్తి చేశానని...ఖచ్చితంగా తన డ్యాన్స్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుందని రెజీనా వెల్లడించారు. రానా దగ్గుబాటి, దియా మీనన్, ప్రభుదేవా, రాశి ఖన్నా ఈ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.