UPI (Photo Credit- Wikimedia Commons)

New Delhi, FEB 16: ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC bank) తమ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రూపే క్రెడిట్‌ (Rupay credit card) కార్డు కలిగిన వినియోగదారులు ఇకపై BHIM లేదా ఇతర యాప్స్‌ ద్వారా UPI చెల్లింపులు చేయొచ్చని తెలిపింది. ఈ సేవలను ప్రారంభించిన తొలి ప్రైవేటు రంగ బ్యాంక్‌ తమదేని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. రూపే క్రెడిట్‌ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్‌బీఐ ఇది వరకే పేర్కొన్న సంగతి తెలిసిందే. రూపే క్రెడిట్‌ కార్డులను యూపీఐ నెట్‌వర్క్‌కు లింక్‌ చేయడం ద్వారా డిజిటల్‌ పేమెంట్స్‌ మరింత సులభతరం కానున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ పేమెంట్స్‌ హెడ్‌ పరాగ్‌ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

UPI Transaction Limit: యూపీఐ పేమెంట్లు అదే పనిగా చేస్తున్నారా, అయితే లిమిట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు 

ఈ విధానం డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో గేమ్‌ ఛేంజర్‌ కానుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (NPCI) సీఓఓ ప్రవీణ్‌ రాయ్‌ తెలిపారు. క్యూఆర్‌ కోడ్‌తో ఎక్కడైనా చెల్లింపులు చేసేటప్పుడు బ్యాంక్‌ అకౌంట్‌ మాదిరిగా ఇకపై క్రెడిట్‌ కార్డును ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ సైతం త్వరలో రూపే క్రెడిట్‌ కార్డుతో యూపీఐ చెల్లింపుల సేవలను తీసుకొచ్చే అవకాశం ఉంది.