Representative Image

New Delhi, July 1: వాహనదారులకు షాకిస్తూ.. పెట్రో దిగుమతులపై విధించే ట్యాక్స్‌ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌,ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌పై రూ.6, లీటర్‌ డీజిల్‌ దిగుమతులపై రూ.13 పెంచుతున్నట్లు (Govt slaps tax on petrol diesel exports) ప్రకటించింది. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే చమురుపై టన్నుకు రూ.23,230 అదనంగా ట్యాక్స్‌ విధించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతుంది.దీంతో రూపాయిపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్రం బంగారంతో పాటు పెట్రోల్‌,డీజిల్‌ ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌) దిగుమతులపై ట్యాక్స్‌ను (India Imposes Export Tax) పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

తాజాగా కేంద్ర నిర్ణయం వాహనదారులకు మరింత భారంగా మారనున్నాయి. ట్యాక్స్‌ పెంపుతో పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ముడిచమురు ధరలు బాగా పెరిగాయి. దేశీయ ముడి ఉత్పత్తిదారులు ముడి చమురును దేశీయ రిఫైనరీలకు అంతర్జాతీయ సమాన ధరలకు అమ్ముతున్నారు. ఫలితంగా దేశీయంగా ముడిచమురు ఉత్పత్తిదారులు లాభాలు ఆర్జిస్తున్నారు' అని ప్రభుత్వం తెలిపింది. "ఈ సెస్ దేశీయ పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు."అంటూ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

బంగారం కొనేవారికి కేంద్రం భారీ షాక్, దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి ఆర్థిక శాఖ, జా నిర్ణయంతో ఎంసీఎక్స్‌ మార్కెట్లో పుంజుకున్న బంగారం ధరలు

పెట్రోల్, డీజిల్ ఎగుమ‌తుల‌పై ప‌న్ను విధిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఫ‌లితంగా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ షేరు విలువ వేగంగా ప‌త‌న‌మైపోయింది. శుక్ర‌వారం ఒక్క‌రోజే ఆ సంస్థ షేరు విలువ 5.75 శాతం మేర త‌గ్గిపోయింది. రిల‌య‌న్స్‌తో పాటు ప్ర‌భుత్వ రంగంలోని ఓఎన్జీసీ సంస్థ షేరు విలువ కూడా భారీగానే ప‌త‌న‌మైంది. ఈ సంస్థ షేరు విలువ ఓ ద‌శ‌లో 10 శాతం మేర న‌ష్టపోయినా... ఆ త‌ర్వాత కాస్తంత కోలుకుంది.

ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం నేప‌థ్యంలో భార‌త్‌కు రాయితీపై చ‌మురును ర‌ష్యా అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చమురును శుద్ధి చేస్తున్న సంస్థ‌లు గ‌తంలో ఉన్న సాధార‌ణ రేట్ల‌కే పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధ‌నాల‌ను ఎగుమ‌తి చేస్తూ భారీ లాభాల‌ను ఆర్జిస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్ర‌భుత్వం ఆయా సంస్థ‌లు ఆయాచితంగా ల‌బ్ధి పొందుతున్నాయ‌న్న అభిప్రాయానికి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఈ త‌ర‌హా లాభాల‌పై విధించే విండ్ ఫాల్ ట్యాక్స్‌తో పాటు ఎగుమ‌తి ప‌న్నును విధిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

నేటి నుంచి ఈ ప్లాస్టిక్‌ వస్తువులు వాడారో జైలుకే, అమల్లోకి వచ్చిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం, నిషేధిత జాబితాలోని ప్లాస్టిక్‌ వస్తువులు ఇవే..

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో దేశం నుంచి విదేశాల‌కు ఎగుమ‌తి అయ్యే పెట్రోల్‌, విమాన ఇంధ‌నం లీట‌రు ఒక్కింటికి రూ.6, డీజిల్‌పై రూ.16 ప‌న్నును ఆయా సంస్థ‌లు క‌ట్టాల్సి ఉంది. అదే స‌మ‌యంలో దేశీయంగా ఉత్ప‌త్తి అయ్యే ట‌న్ను ముడి చ‌మురుపై ఆయా సంస్థ‌లు రూ.23,250 చెల్లించాల్సి ఉంది. ఇప్ప‌టిదాకా ఈ ప‌న్నులేమీ లేక‌పోవ‌డంతో రిల‌య‌న్స్ స‌హా వేదాంత, కెయిర్న్‌ త‌దిత‌ర ప్రైవేట్ కంపెనీల‌తో పాటు ఓఎన్జీసీ వంటి ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు కూడా భారీ లాభాల‌ను ఆర్జించాయి. అయితే తాజాగా ఎగుమ‌తి ప‌న్నుతో ఆయా సంస్థ‌ల షేర్ల విలువ‌లు భారీగా ప‌త‌న‌మ‌వుతున్నాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి శుక్రవారం మరో ఆల్‌టైమ్ కనిష్టం 79.11కి చేరుకుంది, గత కొన్ని వారాలుగా ఆల్ టైమ్ కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే.