Corona Cases: భారత్‌లో తగ్గుతున్న కరోనా తీవ్రత, మరోసారి మరణాల సంఖ్యను సవరించిన కేరళ, విజయవంతంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
Coronavirus Pandemic in India (photo-Ians)

Delhi October, 30: భారత్‌లో కరోనా  తీవ్రంగా క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా రెండో రోజు కూడా 14వేల మందికి కరోనా సోకింది. కేరళలో మృతుల సంఖ్యను మరోసారి సవరించింది. దాంతో 500కిపైగా మరణాలు నమోదయ్యాయి.

శుక్రవారం 11,76,850 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,313 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసులు 3.42 కోట్లకు చేరాయి. శుక్రవారం 13,543 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 3.36 కోట్ల మార్కును దాటాయి. గత కొద్దికాలంగా తగ్గుతున్న యాక్టీవ్‌ కేసులకు వరుసగా రెండో రోజు బ్రేక్ పడింది. ఆ కేసులు స్వల్పంగా పెరిగి.. 1,61,555కి చేరాయి. యాక్టీవ్ కేసులు 0.47 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.19 శాతంగా కొనసాగుతోంది. శుక్రవారం మరో 549 మరణాలు నమోదయ్యాయి. అందులో 471 కేరళ నుంచి వచ్చినవే. దాంతో గత ఏడాది ప్రారంభం నుంచి 4,57,740 మంది కరోనా కాటుకు బలయ్యారు.

మరోవైపు ఈ ఏడాది జనవరి నుంచి నిన్నటివరకు కేంద్రం 105 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని పంపిణీ చేసింది. శుక్రవారం ఒక్కరోజే వ్యాక్సిన్‌ వేయించుకున్నవారి సంఖ్య 56,91,175గా ఉంది.