Coronavirus | Representational Image (Photo Credits: ANI)

New Delhi January 07: భారత్‌లో కరోనా మహమ్మారి (Coronavirus in India)విజృంభణ కొనసాగుతోంది. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే రోజువారీ కేసులు లక్ష దాటాయి. దీంతో 2021, జూన్‌ 6 తర్వాత అంటే గత ఏడు నెలల్లో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు(Positive cases) రికార్డవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ(Health Ministry of India) వెల్లడించింది. రోజువారీ కేసులతోపాటు యాక్టివ్‌ కేసులు(Corona active cases) కూడా ఆందోళనకరమైన రీతిలో పెరుగుతూ వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,17,100 కరోనా కేసులు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,52,26,386కు పెరిగాయి. ఇందులో 3,43,71,845 మంది కోలుకోగా, 4,83,178 మంది బాధితులు మృతి(Corona deaths)చెందారు. మరో 3,71,363 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివిటీ రేటు(corona positivity rate) 7.74 శాతానికి చేరింది. గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 302 మంది మహమ్మారికి బలవగా, 30,836 మంది కోలుకున్నారు.

మహారాష్ట్ర(Maharashtra) మరోసారి కరోనా కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో గురువారం అత్యధికంగా 36,265 కేసులు నమోదయ్యాయి. దీంతో మరఠ్వాడలో మొత్తం కేసులు 67,93,297కు చేరాయి. పశ్చిమ బెంగాల్‌లో 15,421 కేసులు, ఢిల్లీలో 15,097, తమిళనాడులో 6,983, కర్ణాటకలో 5031, కేరళలో 4649, గుజరాత్‌లో 4213, ఉత్తరప్రదేశ్‌లో 3114 మంది కరోనా బారినపడ్డారు.

ఇక కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు(Omicron cases) 3007కు చేరాయి. ఇందులో 1199 మంది బాధితులు కోలుకున్నారని, మరో 1808 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్యశాఖ ప్రకటించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్‌ 291, కేరళ 284, గుజరాత్‌ 204 చొప్పున ఉన్నాయి.

అటు వ్యాక్సినేషన్(Corona vaccination)కూడా జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 149.66 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ముఖ్యంగా 15-18 ఏళ్ల వయస్సువారి వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. ప్రారంభించిన రెండు రోజుల్లోనే కోటి మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.